తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.. వాస్తవానికి మార్చి 10 ,11 న తగ్గినట్టే తగ్గి ఆ తరువాత వైరస్ ప్రభావం పెరిగింది. 14 న ఏకంగా 61 కేసులు నమోదు కాగా నిన్న కొత్తగా మరో 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. తాజాగా మరో 52 మందికి వైరస్ సోకడంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644 కు చేరింది. అంతేకాదు కరోనాతో 18 మంది మృతి చెందారు.
వైరస్ భారిన పడి కోలుకున్న 110 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 644 కేసుల్లో 249 కేసులు కేవలం GHMC పరిధిలోనే నమోదు అయ్యాయి. ఆ తరువాత 36 పాజిటివ్ కేసులతో నిజామాబాదు రెండో ప్లేస్ లో ఉంది. ఆ తరువాత రంగారెడ్డి, వికారాబాద్ లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక సూర్యాపేట జిల్లాలో కొత్తగా మరో మూడు కేసులు నమోదు కాగా ఇందులో సూర్యాపేటలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. ఇక రాష్ట్రంలో వైరస్ తీవ్రతను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు కేటీఆర్, ఈటెల అధికారులతో సమీక్ష నిర్వహించారు.