పూణేలోని భీమా-కోరేగావ్ వద్ద జరిగిన హింసలో నిందితుడుగా ఉన్న గౌతమ్ నవ్‌లఖా ఎన్‌ఐఏ పోలీసుల ముందు లొంగిపోయారు. మహారాష్ట్ర పూణేలోని భీమా-కోరేగావ్ వద్ద 2018లో జనవరిలో హింస చెలరేగింది. అయితే.. ఈ ఘటన జరగటానికి ఒక రోజు ముందు పూణెలో జరిగిన ఎల్గార్ పరిషత్ నిర్వహించడమేనని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. అక్కడి నిర్వహించిన సదస్సులో వక్తలు చేసిన ప్రసంగాలు హింసను రాజేసే విధంగా ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. అయితే.. ఎల్గార్ పరిషత్ వెనుక మావోయిస్టుల హస్తం ఉందని.. కొందరు వామపక్ష ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే.. ఈ కేసులో గౌతమ్ నవ్‌లఖా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ.. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించడంతో పాటు లొంగిపోవడానికి గడువు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తికావడంతో గౌతమ్ నవ్‌లఖా ఎన్‌ఐఏ పోలీసుల ముందు లొంగిపోయారు.