విమాన ప్రయాణికులకు కేంద్ర సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రద్దు చేసుకున్న విమాన టికెట్ల పూర్తి ఛార్జీలు వాపస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తేసారని లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను కేంద్ర సర్కార్ మే 3వరకూ పొడిగించింది. దీంతో అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో క్యాన్సిల్ అయిన టికెట్లకు సంబంధించి నగదు రూపంలో రిఫండ్‌ను వెనక్కి ఇవ్వకూడదని ఎయిర్‌లైన్ సంస్థలు నిర్ణయించాయి. నగదుకు బదులు క్రెడిట్ పాయింట్ల రూపంలో ఇస్తామని, వాటిని తర్వాతి ప్రయాణాల్లో టికెట్ల బుకింగ్‌కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నాయి. దీంతో కొంత మంది ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో స్పందించిన ప్రభుత్వం తాజా ప్రకటన విడుదల చేసింది. రద్దు చేసిన విమానాలకు సంబంధించి పూర్తి సొమ్మును నగదు రూపంలో వెనక్కి ఇవ్వాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. క్యాన్సిలేషన్ చార్జీలను వసూలు చేయకుండా మొత్తం సొమ్మును వెనక్కి ఇవ్వాలని విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. దీంతో లాక్‌డౌన్ ఫస్ట్ ఫేజ్‌లో మే 3 వరకు టికెట్లు బుక్ చేసుకున్న విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్ సంస్థలు పూర్తి మొత్తాన్ని వెనక్కి ఇవ్వనున్నాయి.