ఏపీలో మరో 38 కరోనా కేసులు.. కర్నూల్ లోనే ఎక్కువగా..

Update: 2020-04-17 14:22 GMT

ఏపీలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు. రాష్ట్రంలో కొత్తగా మరో 38 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కి చేరుకుంది. ఇప్పటివరకు 35 మంది డిశ్చార్జ్ కాగా.. 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా నమోదైన కేసుల్లో 13 కేసులు కర్నూల్ లో బయట పడగా.. నెల్లూరులో 6, అనంతపురం, చిత్తూరు జిల్లాలో చెరో 5 చొప్పున నమోదయ్యాయి. అటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4 చొప్పున నమోదు కాగా.. కడపలో ఒక కేసు నమోదైంది. గత 24 గంటల్లో కడపలో 13 మంది, అనంతపురంలో ఇద్దరు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4 చొప్పున, కడపలో ఒక కేసు నమోదైంది.

కాగా.. కర్నూల్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 126 మందికి కరోనా సోకగా.. ఇద్దరు మృతి చెందారు. కానీ.. ఇప్పటి వరకు ఒక్కరు కూడా కరోనా వ్యాధి నయమై డిశ్చార్జ్ అవ్వకపోవటం ఆందోళనకరం. అటు.. ఉత్తరాంధ్రలో కరోనా ప్రభావం తక్కువగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదవ్వలేదు. విశాఖ జిల్లాలో 20 కేసులు నమోదు కాగా.. అందులో 10 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Similar News