ఆంధ్రప్రదేశ్ మాజీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కౌంటర్ ఫైల్ చెయ్యలేదు ప్రభుత్వ న్యాయవాదులు.. దీనికోసం సోమవారం వరకూ గడువు కావాలని కోరారు అడ్వకేట్ జనరల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SEC గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడంపై ఆయనతోపాటు పలువురు ప్రజాస్వామ్య వాదులు హైకోర్టును ఆశ్రయించారు.
దాంతో నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ప్రభుత్వ వాదనను వినడానికి గురువారం వరకూ సమయం ఇచ్చింది. ఈలోపు కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చెయ్యకుండా ఆలస్యం చేస్తోంది.