ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే వ్యాపార సంస్థలు పనిచేయాల్సి ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. సోమవారం నుంచి కొన్ని కార్యకలాపాలు ప్రారంభిస్తామని అన్నారు. కరోనాతో తీవ్రంగా రాష్ట్రము నష్టపోయిందని అన్నారు.
అటు కరోనా ప్రభావం గురించే మాట్లాడిన సీఎం రాష్ట్రంలో ఇప్పటివరకు 66,000 కరోనా పరీక్షలు జరిపించగా.. అందులో 95 శాతం నెగిటివ్ అని తేలిందని చెప్పారు. 300 నుంచి 350 మంది భాదితులు డిశ్చార్చ్ అయ్యారని.. అయితే.. 52 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. కానీ.. వారి కూడా కాపాండేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదవ్వని జిల్లాలు కూడా ఉన్నాయని.. ఆ విషయంలో చాలా సంతోషమని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని.. త్వరలోనే అన్ని సమస్యలకు పరిస్కారం లభిస్తుందని ఆశించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వలస కూలీలను ఉద్దేశించి మాట్లాడారు.