న్యూజిలాండ్ లో మరో ఐదురోజులు లాక్ డౌన్ పొడిగింపు

Update: 2020-04-20 15:44 GMT

న్యూజిలాండ్ లో కరోనా వ్యాప్తి మరింత తగ్గించాలని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.. దేశవ్యాప్తంగా మరో ఐదు రోజులు లాక్డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటన చేశారు. వాస్తవానికి లాక్డౌన్ బుధవారం ముగియవలసి ఉంది, కానీ ఇప్పుడది సోమవారం వరకు ఉండనుంది. కాగా ఇతర దేశాల కంటే తామే కరోనాను బాగా అరికట్టామని ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పారు.

అంతేకాదు ఏప్రిల్ 28 నుండి లాక్డౌన్ కొద్దిగా సడలించబడుతుందని చెప్పిన ప్రధాని అన్ని పరిశ్రమలు, దుకాణాలు క్రమంగా తెరుచుకుంటాయి.. అయితే సామాజిక దూరం కచ్చితంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగడం లేదని న్యూజిలాండ్ ఆరోగ్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటివరకు న్యూజిలాండ్ లో 1440 మందికి వ్యాధి సోకింది, 12 మంది మరణించారు.

Similar News