ఈ సమయంలో అలాంటి మాటలెందుకు: రేణూ దేశాయ్

Update: 2020-04-20 18:19 GMT

పవన్ కళ్యాణ్‌తో రేణూ దేశాయ్ కలిసి నటించిన మొదటి చిత్రం బద్రీ. వచ్చి 20 ఏళ్లైన సందర్భంగా సోషల్ మీడియాలో ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు దర్శక నిర్మాతలతో పాటు నటి రేణూదేశాయ్. చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాల గురించి, పవన్‌తో మాట్లాడిన మాటల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు. పాత జ్ఞాపకాలన్నింటినీ ఓ సారి నెమరువేసుకుని తన్మయత్వం చెందారు. దానికి ఓ నెటిజన్ పోస్ట్ పెడుతూ తన వక్ర బుద్దిని చాటుకున్నాడు. దీంతో రేణూ అతడిని సున్నింతంగా మందలించారు.

ఎందుకు మళ్లీ పాత విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది కదా.. ఆ విషయాలేవీ చెప్పకుండా.. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని కామెంట్ చేశాడు. దాన్ని రేణూ స్క్రీన్ షాట్ తీసి.. అవసరమే. ఇది నా మొదటి సినిమా కాబట్టి. నాకెంతో స్పెషల్ కూడా కాబట్టి.. అయినా ఎందుకండీ ఇంత ద్వేషం.. ప్రస్తుతం మనమం అందరం ఓ సంక్షోభంలో ఉన్నాం. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మంచి ఆలోచనలతో ఉండొచ్చు కదా. కోపం ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు అని రిప్లై ఇచ్చారు రేణూ దేశాయ్.

Similar News