కరోనా గురించి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చేసిన వ్యాఖలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనాలో ఒక రూపం మాత్రమే చూశామని.. అసలు రూపం ముందు ముందు బయట పడుతోందని అన్నారు. అయితే.. ఈ మహమ్మారిపై ఇంకా చాలా మందికి అవగాహన కలగటం లేదని.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆయన అన్నారు. వందేళ్ల కంటే ముందు వచ్చిన స్పానిష్ ఫ్లూ తో ఈ మహమ్మరికి చాలా పోలికలు ఉన్నాయని.. కానీ దాని కంటే చాలా ప్రమాదకరమైనదని అన్నారు.
అటు.. కరోనా విషయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని చేసిన ట్రంప్ ఆరోపణలపై కూడా ఘెబ్రేయేసస్ మొదటి నుంచి తాము కరోనా విషయంలో ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నామని.. వుహాన్ లో పుట్టిన కరోనా ప్రపంచానికి ఒక విషాదాన్ని మిగుల్చుతుందని ముందుగానే చెప్పమని అన్నారు. ఈ విషయంలో ఎదో దాచిపెట్టలేమని.. దాచి పెడితే.. కరోనా మరింత విజృంభిస్తుందని అన్నారు. మన మధ్య ఎలాంటి విభేదాలు లేవని అయన అన్నారు. అమెరికాకి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సిబ్బంది తమతో కలిసి పనిచేస్తున్నారనీ.. అలాంటప్పుడు అమెరికాకి తెలియకుండా మేము ఏదైనా ఎలా దాచిపెట్టగలమని ఆయన ప్రశ్నించారు.