తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 928కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి 23 మంది ప్రాణాలు కోల్పోయారు.