కరోనా అలెర్ట్.. నాలుగు నగరాల్లో పరిస్థితి సీరియస్: కేంద్ర హోంశాఖ

Update: 2020-04-24 20:50 GMT

లాక్డౌన్ వల్ల పరిస్థితిని కొంత కట్టడి చేయగలుగుతున్నాం. లేదంటే వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అహ్మదాబాద్, సూరత్, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. గుర్తించిన హాట్‌స్పాట్ల వద్ద పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెప్పింది. లాక్డౌన్ నియమావళిని ఉల్లంఘిస్తే కరోనాని కట్టడి చేయడం అసాధ్యమని అన్నారు. అప్పుడు ఆరోగ్య సమస్యలు మరింత ఆందోళన కరంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తోంది. ఈ నాలుగు నగరాల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని హోం శాఖ సూచిస్తోంది.

Similar News