స్కాట్లాండ్ కు చెందిన రాయ్ హన్ అనే వ్యక్తికి అక్కడ ప్రత్యేక గుర్తింపు ఉంది. అతనికి 13 మంది పిల్లలు ఉన్నారు. దీంతో రాయ్ హన్ ఫ్యామిలిని డుండీలో అతిపెద్ద కుటుంబంగా వారిని గుర్తిస్తారు. ప్రస్తుతం నైన్‌వెల్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న రాయ్.. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతను కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షలో అతనికి పాజిటివ్‌గా తేలింది. హన్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు.