పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎంపీ ధర్నా..

Update: 2020-04-28 16:11 GMT

పశ్చిమ బెంగాల్ బిజెపి ఎంపి సుకాంత మజుందార్ కు చేదు అనుభవం ఎదురైంది. దక్షిణ నినాజ్‌పూర్‌లోని తన నియోజకవర్గంలోకి ప్రవేశించకుండా పోలీసులు ఆయనను ఆపివేశారు. తన నియోజకవర్గంలో లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించేందుకు ప్రయత్నించిన తనను ప్రతిసారీ నిలిపివేస్తున్నట్టు ఎంపీ చెప్పారు. దాంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ కు లేఖ రాసారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందంటూ నిరసనగా ఆయన రోడ్డు మీద బైఠాయించారు.

ఈ సంక్షోభంలో తమ ప్రాంతంలోని ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీనికి ముందు, బిజెపి ఎంపి జాన్ బార్లాను సామాజిక దూర నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులకు మించి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ .. ఆదివారం, బెంగాల్ బిజెపి నాయకులు రాష్ట్రంలో , ఢిల్లీలో కూడా నిరసన వ్యక్తం చేశారు.

Similar News