కరోనా మహమ్మారి చిన్నారులకు, పెద్దవారికి ఎక్కువ ముప్పు కలిగిస్తుంది. వీరికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 55 ఏళ్లు పైబడిన పోలీసులు లాక్‌డౌన్ ముగిసే వరకు డ్యూటీ చేయవద్దని, ఇళ్లవద్దే ఉండమని చెబుతున్నారు ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్. ఈ మేరకు 94 పోలీస్ స్టేషన్‌లకు అధికారిక సమాచారం అందజేశారు. అలాగే 50 ఏళ్లు పైబడి బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు సెలవు తీసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ వారు విధులు నిర్వహించదలిస్తే.. వారికి బయటి ప్రదేశాల్లో డ్యూటీ వేయకూడదని పోలీస్ ఉన్నతాధికారులకు వివరించారు. వారికి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.