కరోనా వచ్చి కొందరు చనిపోతుంటే కరోనా భయంతో మరి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. యూపీలోని తుండ్లాలో ఒక రైల్వే అధికారికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. దాంతో అతడిని ఎఫ్‌హెచ్ ఆసుపత్రికి తరలించి అక్కడ క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడ దాదాపు డజను మందికి పైగా రైల్వే కార్మికులు క్వారంటైన్‌లో ఉన్నారు. అందులో ఉన్న ఓ రైల్వే ఉద్యోగి బుధవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా వత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తోటి ఉద్యోగులు భావిస్తున్నారు.