మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 522 కొత్త కేసులు

Update: 2020-04-28 20:15 GMT

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 522 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నొత్తం కేసుల సంఖ్య 8,590కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 1,282 మంది కోలుకోగా.. 369 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై, పూణే నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ముంబైలో 3,096 నమోదు కాగా.. పూణెలో 660 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల జాబితాలో అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

Similar News