మహారాష్ట్రలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలకు చేరింది. ఇక పుణేలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ బుధవారం సాయంత్రానికే కేసుల సంఖ్య 1,595కు చేరింది. గడచిని 12 గంటల్లో మరో 127 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పుణే జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1722కు చేరింది.