ఒకరికి వస్తే వంద మందిని క్వారంటైన్‌కి తరలించాల్సి వస్తోంది. నెగిటివ్ వచ్చినా ఎందుకైనా మంచిదని నిర్భంధంలో ఉంచుతున్నారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ టీవీ వీడియో జర్నలిస్ట్ నలుగురు మంత్రులను కలిశాడు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో జర్నలిస్ట్‌ను కలిసిన మంత్రులు.. ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, హోం మత్రి బస్వరాజ్ బొమ్మాయి, వైద్య విద్య మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక శాఖ మంత్రి సిటి రవి ఉన్నారు. కో
విడ్ పరీక్షలో నెగటివ్ అని తేలినప్పటికి ముందు జాగ్రత్తగా తామంతా క్వారంటైన్‌లోకి వెళ్తున్నామని మంత్రులు తెలిపారు. వీరితో పాటు జర్నలిస్ట్ కుటుంబసభ్యులను, అతడిని కలిసిన ఇతర మీడియా సిబ్బంది దాదాపు 40 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. కాగా, కర్ణాటకలో ఇప్పటి వరకు 532 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 215 మంది కోలుకున్నారు. 20 మంది ప్రాణాలు కోల్పోయారు.