కెనడాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఐదుగురు గల్లంతు ఆయ్యారు. నాటో టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా ప్రయాణించిన హెలికాప్టరు గ్రీస్ లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధాని వెల్లడించారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, గల్లంతైన వారంతా క్షేమంగా భయటపడాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.