గడిచిన 24గంటల్లో భారత్‌లో 1718 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,050కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అటు భారత్‌లో కోలుకుంటున్న వారి శాతం 25.19గా పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా 8,324 మంది భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నన్నారని.. అటు, కరోనాతో మరణించిన వారిలో 78 శాతం మందికి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని లవ్ అగర్వాల్ ప్రకటించారు.