అంబులెన్స్ ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే వరప్రదాయిని. రోడ్లపై అంబులెన్స్ శబ్దం వినిపిస్తే ప్రతి ఒక్కరు తప్పుకుని దారిస్తారు. ఇటువంటి అంబులెన్స్‌ను కొందరు కల్లు తరలించడం కోసం వినియోగించారు. హైదరాబాద్ లో కొందరు వ్యక్తులు కల్లు తరలించడం కోసం అంబులెన్స్‌ను ఉపయోగించుకున్నారు. ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో కల్లు తరలిస్తున్న ఇద్దరిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు రెండు క్యాన్లలో 30 లీటర్ల కల్తీ కల్లు తీసుకొని బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో బల్కంపేట చేరుకున్నారు. పోలీసులు ఆ వాహనం సోదా చేయగా కల్లు తరలిస్తున్న విషయం బయటపడింది. దీంతో వారిని అరెస్టు చేశారు.