బ్రిడ్జి కిందనే బతుకుపోరాటం..

Update: 2020-05-03 15:44 GMT

ఉన్న ఊరుని, కన్న తల్లిని విడిచి కట్టుబట్టలతో వలస కార్మికులు ఊరు.. ఒక్కోసారి రాష్ట్రాలు కూడా దాటుతుంటారు. ఎక్కడ పని దొరికితే అక్కడే వారి నివాసం. పెద్ద గాలి వస్తే ఎగిరిపోయే గూళ్లు, భారీ వర్షం వస్తే కొట్టుకుపోయే ఇళ్లు నిర్మించుకుని బ్రతుకు పోరాటం సాగిస్తుంటారు. అందులోనే భార్య బిడ్డలు.. కలో గంజో కలిసే తాగుతారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చేయడానికి పనిలేక రోజువారీ వేతన జీవులు, వలస కూలీలు, నిరుపేదలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. మహబూబ్ నగర్‌కు చెందిన గంగాధర్‌ చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆలేరు బస్టాండ్‌లో ఉన్న వీరిని అక్కడి నుంచి పంపించి వేయడంతో నెల రోజులుగా ఓ బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నారు. ఊరి ప్రజల సాయంతో ఒక్కపూటైనా తింటున్నాం అని చెమర్చిన కళ్లతో చెబుతున్నారు.

Similar News