కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ప్రపంచానికి ఈ ప్రాణాంతకర వైరస్ తన ప్రభావాన్నిచూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల 81 వేల 465 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 44 వేల 666 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి నుంచి కోలుకుని 11 లక్షల 8 వేల 389 మంది డిశ్చార్జ్ అయ్యారు.