మే 31వరకు తప్పదు.. లాక్‌డౌన్

Update: 2020-05-04 18:43 GMT

కరోనాను కట్టడి చేయాలంటే కళ్లముందు ఒక్కటే కనిపిస్తుంది.. లాక్డౌన్. ఒక్కసారి లాక్ ఓపెన్ చేశామా కేసుల సంఖ్య లెక్కకు మించి నమోదవుతుందేమో అని ప్రభుత్వాల్లో ఆందోళన. మే 7 వరకు కొనసాగుతున్న లాక్డౌన్‌ని నెలాఖరు వరకు కొనసాగించాలని అనుకుంటోంది జపాన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి సోమవారం జపాన్ ప్రధాని షింజో అబే నిపుణుల బృందంతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో 15,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 530 మంది మరణించారు. నెలరోజుల పాటు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆగడువు మే 7తో ముగియనుంది. లాక్డౌన్ పొడిగించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తరువాత కానీ పార్కులు, మ్యూజియం వంటి పబ్లిక్ ప్లేసులకు అనుమతులు మంజూరు చేస్తామని జపాన్ ఆర్థిక మంత్రి వెల్లడించారు.

Similar News