coronavirus : భారత్ లో రికవరీ రేటు పెరిగింది

Update: 2020-05-06 17:39 GMT

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 49 వేల 517 కు పెరిగింది. ఇప్పటివరకు 14 వేలకు పైగా రోగులకు కూడా నయమైంది. ఇదిలావుండగా, బుధవారం కర్ణాటక ప్రభుత్వం 1610 కోట్ల రూపాయల సహాయ ప్యాకేజీని ప్రకటించింది. మరోవైపు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రోగుల వ్యక్తిగత సమాచారం ఆసుపత్రులు లీక్ అయ్యే అవకాశం ఉందని.. దీనిపై కోర్టు కలుగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను మే 11 వాయిదా వేసింది కోర్ట్. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో, గరిష్టంగా 1020 మందికి నయమైంది.. దాంతో రికవరీ రేటు 27.41% పెరిగింది.

Similar News