coronavirus : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న మరణాలు..

Update: 2020-05-05 23:38 GMT

ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు రెండు లక్షల 52 వేల 390 మంది మరణించారు. 36 లక్షల 45 వేల 194 మందికి వ్యాధి సోకింది. 11 లక్షల 94 వేల 872 మంది కోలుకోవడంతో ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాంకాంగ్‌లోని స్థానిక ప్రభుత్వం శుక్రవారం నుంచి ఆంక్షలను సడలించాలని నిర్ణయించింది. అలాగే ఇటలీ జర్మనీ దేశాలు కూడా లాక్ డౌన్ ను సడలించాయి. అయితే బల్గేరియా ప్రభుత్వం సెప్టెంబరు వరకూ కూడా దేశంలో ఏ పాఠశాల తెరవకూడదని నిర్ణయించింది.

ఇదిలావుంటే అమెరికాలో 24 గంటల్లో 1050 మంది మరణించారు, కొత్తగా 24 వేలకు పైగా కేసులు కనుగొనబడ్డాయి. ఇప్పటివరకు, దేశంలో సంక్రమణ గణాంకాలు 1.2 మిలియన్లు దాటాయి. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన అంతర్గత మెమో ప్రకారం జూన్ 1 నాటికి దేశంలో మరణాల సంఖ్య రోజూ మూడు వేల వరకు ఉండవచ్చని అంచనా వేశాయి.

Similar News