గుడ్ న్యూస్: విశాఖలో లీకైన గ్యాస్ వలన దీర్ఘకాలిక సమస్యలు తక్కువ

Update: 2020-05-07 21:47 GMT

విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మంది మృతి చెందగా.. వందల మంది బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. స్టీరిన్‌ వాయువును లీకేజ్ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. పలువురు తెరపైకి తెస్తున్నారు. ఈ వార్తలపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గుల్జేరియా స్పందించారు. స్టీరిన్ వాయువు విషపూరితమైందే కానీ, దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువని ఆయన చెప్పారు. దీంతో.. పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News