సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన ఓ అధికారి కరోనా వైరస్‌తో కోల‌్‌కతాలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఈ విభాగానికి చెందిన ఒకరు కరోనాతో మరణించారు. మృతి చెందిన అధికారి అసిత్ కుమార్ షా అని ఆయన కోల్‌కతా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ కన్నుమూశారని పోలీసులు తెలిపారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన మరో 50 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అసిత్ కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.