క్వారంటైన్ నుంచి 23 మంది కార్మికులు ప‌రార్!

Update: 2020-05-08 14:21 GMT

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 56 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా అనుమానితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే పనిలో స్పీడ్ పెంచారు. అనుమానితులందర్నీ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వీరిలో ఎవరికైనా పాజిటివ్ లని రిపోర్టులు వస్తే వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే పలు రాష్ట్రాల్లో క్వారంటైన్‌ నుంచి, ఐసోలేషన్ వార్డుల నుంచి కరోనా రోగులు పారిపోతున్నారు. తాజాగా చ‌త్తీస్‌గ‌ఢ్‌లో కూడ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

దంతెవాడ జిల్లాలోని క్వారంటైన్ సెంట‌ర్ నుంచి 23 మంది వ‌ల‌స కార్మికులు ప‌రార‌య్యారు. అరాన్ పూర్ లోని బాయ్స్ హాస్ట‌ల్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంట‌ర్ నుంచి 23 మంది వ‌ల‌స కార్మికులు పారిపోయినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కార్మికులను ప‌ట్టుకుని తిరిగి క్వారంటైన్ లో ఉంచుతామ‌న్నారు.