మాస్క్ పెట్టుకోలేదంటే రూ.1000 ఫైన్..

Update: 2020-05-08 17:33 GMT

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే. లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈనెల 29 వరకు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. దాంతో పాటు రాష్ట్ర మంతటా రాత్రి 7 నుంచి ఉదయం

7గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అత్యవసర వైద్య సహాయానికి అనుమతి. ఆస్పత్రులు, మెడికల్ సర్వీసులు తెరిచి ఉంటాయి.

Similar News