ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ వడ్డీ రేట్లను 3 సంవత్సరాల వరకు టేనర్‌కు 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, బ్యాంకు ఎఫ్‌డీలపై రేట్లను తగ్గించడం రెండు నెలల్లో ఇది మూడోసారి. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను కూడా గత నెలలో తగ్గించారు. ఇదే సమయంలో సీనియర్ సిటిజన్లను ఆకర్షించేందుకు వారి కోసం ప్రత్యేకంగా ఎస్బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీం ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.