బ్రేకింగ్.. ఘోర రైలు ప్రమాదం.. 15మంది వలస కూలీలు మృతి

Update: 2020-05-08 10:33 GMT

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది వలస కూలీలు మృతి చెందారు. మరణించిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై వలస కూలీలు నిద్రస్తుండగా, వారిపై నుంచి గూడ్స్‌ రైలు వెళ్ళినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ట్రాక్‌పై నిద్రకు ఉపక్రమించారు. కాగా జల్నా-ఔరంగాబాద్‌ మధ్య నడిచే గూడ్స్‌ రైలు వీరు నిద్రిస్తున్న ట్రాక్‌పై నుంచి పోవడంతో కూలీలంతా అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు, రైల్వే పోలీస్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.

Similar News