కరోనా ఎఫెక్ట్.. ఈసారి ఖైరతాబాద్ గణేశ్..

Update: 2020-05-12 18:20 GMT

ఎవరికీ అందనంత ఎత్తులో ఉండి అలరిస్తుంటాడు ఖైరతాబాద్ గణేశుడు. ఆ భారీ విగ్రహ మూర్తిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వినాయక నవరాత్రులన్ని రోజులు భారీ సంఖ్యలో భక్తులు, వారిని అదుపు చేసేందుకు పోలీసులు. మరి కరోనా నేపథ్యంలో వాటన్నింటికీ చెక్ పెట్టాల్సి వస్తుంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే గణేషుడి విగ్రహం ఉండనుందని సమాచారం. ఈ మేరకు గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గణేశ్ తయారీలో తొలి ఘట్టమైన కర్రపూజను మే 18 సాయిత్రం 5 గంటలకు జరపనున్నారు. అదే రోజు గణేశ్ విగ్రహం తయారీపై కూడా ప్రకటన చేయనున్నట్లు ఉత్సవ కమిటీ చౌర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. కాగా, 1954 నుంచి ఖైరతాబాద్ గణేశుడు ఒక్కో అడుగే పెరుగుతూ గత ఏడాది 61 అడుగులకు చేరుకున్నాడు. ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శనమిచ్చాడు. కోటి రూపాయలతో రూపుదిద్దుకున్న ఆ గణేశుడిని 100 మంది కళాకారులు నాలుగు నెలలపాటు కష్టపడి తయారు చేశారు.

Similar News