గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో లాక్‌డౌన్‌పై మరింత దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కరోనా పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆరెంజ్ జోన్‌లలో కొంతకాలంగా కేసులు నమోదు కాకపోవడంతో..వాటిని గ్రీన్ జోన్లుగా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీ నోటిఫై కాగానే జిల్లాల మధ్యలో బస్సులను నడిపేందుకు సర్కారు సిద్ధమవుతోంది.