భారత్‌లో 40శాతానికి చేరిన రికవరీ రేటు

Update: 2020-05-19 16:55 GMT

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే, అదే సమయంలో దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారు కూడా క్రమంగా పెరుగుతున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. అటు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 1,01,139 మందికి కరోనా సోకగా.. 3163 మంది చనిపోయారు. దీంతో మరణాలు రేటు 3శాతంగా నమోదైంది. కాగా, మొత్తం కేసుల్లో 30,174మంది పూర్తిగా కోలుకొని.. డిశ్చార్జ్ అయ్యారు. ఇదే విషయంపై స్పందించిన నీతిఅయాగ్ సీఈఓ కరోనా పాజిటివ్ కేసులతో పాటు.. రికవరీ రేటు, మరణాల సంఖ్య కూడా చాలా ముఖ్యమని అన్నారు. మరణాలు, రికవరీ రేటు ఈ మహమ్మరితో మనం ఎంత విజయంవంతంగా పోరాడుతున్నామో తెలియజేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచదేశాలతో పోల్చి చూస్తే.. భారత్.. మృతులు, రికవరీ రేటు విషయంలో చాలా మెరుగ్గా ఉందని అన్నారు.

Similar News