భారత్‌లో 40శాతంకు పైగా రికవరీ రేటు

Update: 2020-05-21 17:33 GMT

భారత్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే, అదే స్థాయిలో బాధితులు కరోనా నుంచి రికవరీ అవ్వడం ఉపసమనం కలిగిస్తున్న విషయం. ప్రతీ రోజు రికవరీ రేటు పెరుగుతోంది. ఏ దేశంలో లేనంతగా భారత్ లో 40 శాతం పైగా రికవరీ రేటు ఉంది. భారత్ లో ఇప్పటివరకూ మొత్తం 1,12,442 కేసులు నమోదవ్వగా.. 45422 మంది రికవరీ అయ్యి.. డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా.. 63,582 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 3,438 మంది కరోనాతో మరణించారు. ఈ స్థాయిలో రికవరీ రేటు ఏ దేశంలో లేకపోవడం గమనార్హం.

Similar News