మహారాష్ట్రలో కొత్తగా 2190 కరోనా కేసులు.. మరణాలు చూస్తే..

Update: 2020-05-28 17:57 GMT

గత 24 గంటల్లో, మహారాష్ట్రలో కొత్తగా 2190 సంక్రమణ కేసులు నమోదయ్యాయి, 964 మంది రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కొత్తగా 105 మంది మరణించారు. తాజాగా మరణించిన 105 మంది రోగులలో 72 మంది పురుషులు, 33 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 60 మంది రోగులకు గతంలో ఇతర వ్యాధులు ఉన్నాయి. ఇందులో ముంబైలో అత్యధిక మరణాలు సంభవించాయి. అలాగే థానేలో 16, జల్గావ్‌లో 10, పూణేలో 9, నవీ ముంబై 7, రాయ్‌గడ్‌లో 7, అకోలాలో 6, ఔరంగాబాద్‌లో 4, నాసిక్ 3, సోలాపూర్‌లో 3, సతారాలో 2 మరణాలు సంభవించాయి.

అహ్మద్‌నగర్, నాగ్‌పూర్, నందూర్‌బార్, పన్వెల్ 1, వాసాయి-విరార్లలో 1 మంది రోగులు మరణించారు. ఇక రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య ఇప్పుడు రాష్ట్రంలో 56 వేల 948 కు పెరిగింది. ఇందులో 17 వేల 918 మంది కోలుకున్నారు, మొత్తం 1897 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో అత్యధికంగా 1097 మంది మరణించారు. నగరంలో కొత్తగా 1044 కరోనా కేసులతో, ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేల 835 కు పెరిగింది.

Similar News