రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి.. ఎండి వీరేంద్ర కుమార్ గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి 8.30 గంటలకు కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. వీరేంద్రకుమార్‌కు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 83 ఏళ్ల వీరేంద్రకుమార్, మాతృభూమి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ఆయన లోక్‌సభ సభ్యునిగా కోజికోడ్ నుంచి రెండుసార్లు గెలిచిన వీరేంద్రకుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కూడా వీరేంద్ర కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు.