తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ జూన్‌ ఆరు వరకు పొడిగింపు

Update: 2020-05-30 09:25 GMT

తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ జూన్‌ ఆరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులు, ట్రిబ్యునళ్ల లాక్‌ డౌన్‌ పొడిగిస్తున్నట్టు హైకోర్టుస్పష్టం చేసింది. అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల్లో ఆన్‌లైన్‌లతో పాటు నేరుగా పిటిషన్లు దాఖలుకు హైకోర్టు అనుమతిచ్చింది. కోర్టుల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ ‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.

Similar News