కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం నెలకొంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్, పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రేమ్ ఇద్దరూ అన్నాదమ్ములు. వీరిద్దరూ సరదాగా ఇంటి సమీపంలో ఉన్న పంపుల చెరువు వద్ద సెల్ఫీ తీసుకుందామని వెళ్లారు. ఈ సయమంలో హర్షవర్ధన్ ప్రమాదవశాత్తు జారీ చెరువులో పడిపోయాడు. దీంతో అన్నయ్యను కాపాడేందుకు తమ్ముడు ప్రేమ్ చెరువులో దూకేశాడు. కానీ ఇద్దరూ నీళ్లలో మునిగిపోయి చనిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు.. వీరిద్దరి మృతదేహాలను చెరువు నుంచి బయటికి తీశారు. పోస్ట్‌మార్టమ్ కోసం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు కుమారులు చనిపోవడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.