విరిగిపడ్డ కొండచరియలు.. 20 మంది మృతి

Update: 2020-06-02 16:44 GMT

అస్సాంలో భారీ వర్షాల కారణంగా మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. చాచర్, హెలకాండి, కరీమ్‌గంజ్ అనే మూడు జిల్లాల్లో మొత్తం 20 మంది మరణించారు.19 మంది గాయపడ్డారు. హైలాకాండిలో 7 మంది మరణించారు. వీరిలో 6 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. ఇందులో నలుగురు పిల్లలు ఉన్నారు. భట్బజార్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి.

13 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పెంచాలని ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్ జిల్లా యంత్రాంగాన్ని, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ను ఆదేశించారు. అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఉన్నాయి. వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. 21 జిల్లాల్లో మొత్తం 9 లక్షల మంది దీని బారిన పడుతున్నారు.

Similar News