రారండోయ్ వేడుక చూద్దాం.. రానా,మిహికల పెళ్లి వేడుక మూడు రోజులంట

Update: 2020-06-02 11:23 GMT

దగ్గుబాటి రానా మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రేమించిన మిహిక బజాజ్‌ని రానా ఆగస్ట్ 8న పెళ్లి చేసుకుంటున్నారు. వీరి వివాహాన్ని హైదరాబాద్‌లోనే జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్ కుటుంబాలు ఏర్పాట్లు మొదలు పెట్టాయి. వివాహ వేడులను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిసింది. కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితులు ఈ వేడుకలకు హాజరవుతారని సన్నిహిత వర్గాల సమాచారం. తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం ఈ వేడుక నిర్వహిస్తారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే వేడుక నిర్వహించనున్నారు. ముహూర్తం నాటికి పరిస్థితులను బట్టి హాజరయ్యే అతిధుల సంఖ్యను నిర్ణయిస్తారు. మిహిక బజాజ్ ఎలాగూ వెడ్డింగ్ ప్లానర్. ఆమె ఆలోచనలకు అనుగుణంగానే వేడుక జరుగుతుందట.

Similar News