మహారాష్ట్ర కరోనాతో విలవిలలాడుతోంది. దేశంలో 40శాతం కేసులు అక్కడే నమోవదవ్వటం కలకలం రేపుతోంది. అయితే, కరోనా విధుల్లో శ్రమిస్తున్న పోలీసులు కూడా ఎక్కవగా కరోనాకు గురవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకూ పోలీస్ శాఖలో 2557 మందికి కరోనా సోకింది. అయితే వీరిలో 191మంది పోలీస్ అదికారులు ఉన్నారు. అటు, ఇప్పటి వరకూ 30 మంది పోలీసులు చనిపోయారు. అందులో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులుకు ఎక్కువగా కరోనా సోకుతుంది. ఇప్పటివరకూ నాలుగు దశల్లో లాక్‌డౌన్ అమలు చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు.. ఐదోదశలోకి అడుగుపెట్టాయి. అయితే మొదటి రెండుదశల్లో లాక్‌డౌన్ విజయవంతంగా కొనసాగింది. కానీ, మూడోదశ నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ రావడంలో పోలీసుల విధులు నిర్వహించడం మరింత కష్టం అయింది. దీంతో ప్రజలను కరోనా నుంచి కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.