మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ భారం మోపడం సరైంది కాదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.. ఈఎంఐలపై వడ్డీ మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త స్పందన దాఖలు చేయాలనీ సుప్రీంకోర్టు గురువారం సూచించింది. టర్మ్ ఋణాల తాత్కాలిక నిషేధంపై వడ్డీ మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 26 న సుప్రీం కోర్టు ఆర్‌బిఐ స్పందన కోరింది. అయితే ఆర్‌బిఐ బుధవారం దీనికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది, అందులో ఇలా పేర్కొంది. బలవంతపు వడ్డీ మాఫీ మంచిది కాదని, ఇది బ్యాంకుల ఆర్థిక సాధ్యతకు ప్రమాదం అని డిపాజిటర్ల ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంది.
ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ దాఖలు చేసిన పిటిషన్ లో.. తాత్కాలిక వ్యవధిలో వడ్డీని వసూలు చేయకుండా రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కల్పించాలని ప్రభుత్వానికి , రిజర్వ్ బ్యాంక్ నకు విజ్ఞప్తి చేశారు.. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా, ఎస్కె కౌల్లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో రెండు అంశాలను పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంటూ మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం, వడ్డీపై వడ్డీ విధించకపోవడం పరిశీలించాలని కోరింది.. ఈఎంఐలపై వడ్డీ భారంపై బదులివ్వాలని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమాధానం కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు.
కాగా కోవిడ్ -19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్బిఐ మే 22 న టర్మ్ లోన్లపై తాత్కాలిక నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది. మార్చి 1 నుండి మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల చెల్లింపుపై సెంట్రల్ బ్యాంక్ మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించింది.