కరోనా ఎఫెక్ట్: కొత్త పథకాలు కట్

Update: 2020-06-05 16:50 GMT

కరోనా, లాక్‌డౌన్ ప్రభావం అన్నిరంగాలపైన పడింది. తాజాగా కేంద్రఆర్థిక శాఖ కూడా ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టడంలేదని తెలిపింది. లాక్‌డౌన్‌తో ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయని.. వాటిని చాలా పొదుపుగా వాడుకోవాలని తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ఖర్చులు బాగా పెరిగాయని అన్నారు. ఆర్థికశాఖ మాత్రమే కాదు.. ఇతర శాఖలు కూడా కొత్తపథకాలు ప్రకటించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీతో పాటు తాజాగా ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ పథకాలను మాత్రం అమలుచేస్తామని తెలిపారు. గత బడ్జెట్ కింద ఇప్పటికే ఆమోదం పొందిన పథకాలను కూడా 2022 మార్చి 31 వరకూ నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News