కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్నందున ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని సామూహికంగా నిర్వహించడంలేదని కేంద్రం ప్రకటించింది. ప్రతీ ఒక్కరూ ఇంటోనే యోగా దినోత్సవం జరుపుకోవాలని.. అయితే, ఇంట్లో కూడా సామాజిక దూరం పాటించాలని అన్నారు. ‘‘ఇంట్లో యోగా... కుటుంబ సభ్యులతో యోగా’ అన్న నినాదాన్ని కేంద్రం ప్రకటించింది. ప్రతీ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.