మంచిర్యాల జిల్లాలో పెద్దపులి హల్‌చల్ చేసింది. శ్రీరాంపూర్ సింగరేణి జీఎం ఆఫీస్ సమీపంలో పులి సంచారం కలకలం రేపింది. రోడ్డు దాటుతూ వాహనదారుల కెమెరాకు చిక్కింది పులి. అటవీ అధికారులకు సమచారం అందడంతో.. పులి ఆచూకీపై పరిశీలిస్తున్నారు. పులి అడుగుల ఆధారంగా ఆర్‌కే8 భూగర్భగని పరిసరాల్లో పులి సంచరించినట్టు అటవీ అధికారులు నిర్ధారించారు. 2 నెలల క్రితం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి ఆనవాళ్లు గుర్తించారు. ఇప్పుడు అదే పులి మంచిర్యాల జిల్లా వైపు వచ్చినట్టు అనుమానం చేస్తున్నారు. పులి చెన్నూరు అటవీ ప్రాంతం వైపు వెళ్తున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.