పాకిస్తాన్ మాజీ ప్రధానిపై అత్యాచార ఆరోపణలు

Update: 2020-06-06 14:06 GMT

పాకిస్తాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రాజా గిలానీపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న సింథియా డి రిట్చీ అనే అమెరికన్ బ్లాగర్.. మాజీ హోంమంత్రి రెహమాన్ మాలిక్ తనపై అత్యాచారం చేశాడని.. అలాగే మాజీ ప్రధాని యూసుఫ్ రాజా గిలానీ కూడా శారీరక హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. దీనిపై తనకు న్యాయం జరుగుతుందని.. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కాగా ఆమె చేసిన ట్వీట్ ప్రకారం ఈ రెండు సంఘటనలు 2011 న జరిగాయి..

ఈ సమయంలో బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) అధికారంలో ఉంది. ప్రస్తుతం, పార్టీకి బెనజీర్ కుమారుడు బిలవర్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఆమె చేసిన ఆరోపణలను మాజీ ప్రధాని గిలానీ సింథియా పూర్తిగా తోసిపుచ్చారు. రాష్ట్రపతి భవన్ లో ఒక ప్రధాని ఈ విధమైన చర్య చేయగలరా? అని ప్రశ్నించారు.. మరోవైపు ఈ ఆరోపణలపైరెహమాన్ మాలిక్ ఇంతవరకు స్పందించలేదు. ఆ సమయంలో మాలిక్ హోంమంత్రిగా ఉన్నారు.

Similar News