భారత్‌లో కరోనా కలకలం.. కొత్తగా 10వేలు కేసులు

Update: 2020-06-07 12:21 GMT

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతీరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 9971 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,46,628కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అటు, కరోనా మరణాలు కూడా రోజు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. 24 గంటల్లో 287 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6929కి చేరింది. ఇప్పటి వరకూ 1,19,292 మంది కోలుకోగా మరో 1,20,406 మంది చికిత్స పొందుతున్నారు. ఓ వైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ కేసులు సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా నమోదైన కేసులతో భారత్ స్పెయిన్ ను దాటి ఐదవ స్థానానికి వచ్చింది. అటు, కరోనా మరణాల విషయంలో భారత్ 12వ స్థానంలో ఉంది.

Similar News