భారత్‌లో సెప్టెంబర్ నాటికి కరోనా అంతం

Update: 2020-06-07 13:52 GMT

భారత్‌లో కరోనా రోజురోజుకి పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మన దేశంలో సెప్టెంబర్‌లో కరోనా అంతమవుతోందని ఓ పరిశోదనలో తేలినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలోని కరోనా కేసులు ఆధారంగా పరిశోధన చేయగా ఈ విధమైన ఫలితాలు వచ్చినట్టు తెలిపింది. డైరక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ కు చెందిన డిప్యూటీ డైరక్టర్ జనరల్ అనిల్ కుమార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరక్టర్ రూపాలీ రాయ్.. ఓ మేథమెటికల్ మోడల్ సాయంతో ఈ అంచనాలను రూపోందించారు. దీని ప్రకారం.. కరోనా నుంచి కోలుకున్న వారు, మరణించిన వారి సంఖ్య మొత్తం కొత్తగా నమోదవుతున్న కేసులతో సమానమైనపుడు కరోనా సంక్షోభం సమసిపోతుందని వారు తెలిపారు. రోజువారి కేసులు నమోదవుతున్న విదానాన్ని బట్టి సెప్టెంబర్ 15 నాటికి కరోనా పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు. అయితే.. జనాభా, వాతావరణ మార్పులు కరోనాపై ప్రభావం చూపిస్తే.. ఈ అంచనాలో మారొచ్చని తెలిపారు.

Similar News